BHAGAVATA KADHA-3    Chapters   

వి దు రు ఁ డు

43

శ్లో || అబిభ్రదర్యమా దండం యథావదఘ కారిషు |

యావద్దధార శూద్రత్వం శాపాద్వర్షశతం యమః ||

శ్రీ భాగ -1 స్కం.13. అ. 15 శ్లో ||

"మాండవ్యమహాముని శాపంబునం దొల్లి యముండు శూద్రయోనియందు విదురుండై జన్మించియున్న నూఱు వత్సరంబు లర్యముండు యథాక్రమంబునం బాపకర్ముల దండించెను"

---శ్రీ దాంధ్రభాగవతము

ఛ ప్ప య

ముని మాండవ్య మహా 9 మనస్వీ మౌనీ దుష్కర |

కరేఁ తపస్యా తీవ్రద్వార ఆశ్రమ కే తరుతర ||

కరికేఁచోరీ చోర ఓర ఆశ్రమ కీ ఆయే |

దేఖి దూరితేఁ దూత ద్రవ్య ధరి తహాఁలు కాయే ||

పూఛేఁ ముని తేఁ దూత సబ, మౌనీ ఉత్తర దేహిఁ కస |

యహీ చోర నరదారహై, సబ మిలి నిశ్చియ కియో అన ||

అర్థము

మాండవ్య మహాముని గొప్ప మనస్వీ. మౌని. దుష్కర తపస్సను చేసినవాఁడు. అట్టివాఁడొకనాఁడు తన యాశ్రమములోఁ జెట్టుక్రిందఁ గూర్చుండి తపస్సు చేసికొనుచుండెను. చోరులు దొంగతనముచేసి యీతని యాశ్రమము వైపునకుఁ బరువిడిరి. తమవెంట రాజభటులు పడుటనుగాంచి ఆ ద్రవ్యము నచ్చట వదలి వెడలిరి. భటులు ముని నడుగ నాతఁడు మౌనియగుటచే మాటలాడలేదు. ఆతఁడే దొంగలసరదారుఁడని యందఱు నిశ్చయించుకొనిరి.

----

ఎంటి తేజస్వియగు తపస్వి యగుఁగాక ! ప్రారబ్ధము ననుభవింపవలసినదే. ప్రారబ్ద మనుభవింపకున్న నశింపదు. జీవన్ముక్తుడైనను శరీరముండఁగా బ్రారబ్ధ మనుభవింపవలసియే యుండును. కాని ఆతఁడా సుఖదుఃఖములలోఁగాని, క్రియామాణమగు కర్మలోఁగాని మునిఁగిపోఁడు. అయితే యిది సంచితకర్మలో గలిసి భవిష్యత్ర్పారబ్ధమును నిర్మించుకొనదు. అయినప్పటికి ఈ శరీర మున్నంతవఱకు ప్రారబ్ధకర్మము తప్పదు. మానవులకే కాదు. ఋషులు, మునులు, యక్షులు, కిన్నరులు, దేవతలు, ప్రజాపతులు, లోకపాలురు వేయేల నందఱును బ్రారబ్ధమునకు వశులై కార్యములు చేయుచుందురు. వారుకూడ నానావిధములగు నుచ్ఛ నీచ యోనులలోఁ బుట్టవలసియుండును.

విదురుడు సాక్షాత్తుగ యమధర్మరాజనియు, ముని శాపవశమున నాతఁడు నూఱువర్షములవఱకు శూద్రుఁడై యుండవలసి వచ్చినదనియు సూతుఁడు చెప్పఁగానే శౌనకుఁడిట్లడిగెను :- " సూతా ! మాండవ్య మహాముని యమధర్మరాజును భూమిమీఁద శూద్రుఁడవై పుట్టుమని శపించుట కాతఁడేమి యపరాధమును గావించెను ? ఈ విషయమును దెలిసికొన వలయునని మాకు మిక్కిలి కుతూహలముగనున్నది. ఆవిషయము మాకు చెప్పఁదగునది యగునెడలఁ జెప్పుడు."

శౌనకుని వాక్యములను విని సూతుఁ ట్లనెను :- " మునులారా ! ఎవఁడు ననవసరముగా శాపమీయఁడు, అనుగ్రహింపఁడు. అందఱును దైవమునకు, నదృష్టమునకు నధీనులు. సర్వులకు సమస్తమైనవారితో సమస్తకార్యములు, సమస్త కాల సంయోగమున జరుగుచుండును. ఆ సంయోగకాలము రాఁగానే తనకుఁదానే జీవులకు దానికి తగిన బుద్ధికలిగి, దాని ననుసరించియే కార్యములందు ప్రవృత్తులగుచుందురు. యముని శాపవృత్తాంతముకూడ చాల మనోరంజకమైనది. దాని నత్యంత సంక్షేపముగ మీకు చెప్పుచున్నాను మీరందరు స్వస్థచిత్తముతో శ్రవణము చేయుఁడు.

పూర్వకాలమున మాండవ్యుఁడను పేరుగల మహాముని కలఁడు. ఆతఁడు జితేండ్రియుఁడు. ధర్మపరాయణుఁడు. తపోనిరతుఁడు.తేజస్వియగు ముని. ఆతఁ డెల్లప్పుడు ధర్మకార్యనిరతుఁడు. ఆతని యాశ్రమద్వారమున మంచి నీడనిచ్చు వృక్షముండెడిది. దానిక్రింద నాతఁడు మౌనవ్రతియై ఊర్ధ్వ బాహువులతో ఁదపస్సు చేయుచుండెను. ఆతనికి బాహ్యజగత్తు యొక్క స్పృహలేనంతటి సమాధి కలుగుచుండెడిది.

ఒకానొక దినమునఁ గొందఱు దొంగలు రాజుగారింట దొంగతనముచేసి చాల ద్రవ్యమును దీసికొని పాఱిపోవుచుండిరి. ఆ సమయమున వారికి మెలఁకువవచ్చెను. రాజభటులు దొంగల వెంటఁబడి తరిమిరి. రాజభటులు దగ్గఱకు వచ్చునప్పటికి అక్కడికి దగ్గఱగా నున్న మాండవ్యమహాముని ఆశ్రమములో దాఁగుకొనిరి. దొంగిలించినది కూడ ఆ దగ్గఱలో దాఁచియుంచిరి. రాజభటులు ఇంతవఱకు సమీపములోనున్న దొంగ లెచ్చట మాయమైపోయిరో యని చింతించి, మాండవ్య మహాముని కడుకు వెడలి యిట్లడిగిరి :- " దేవా ! దొంగలు చాలమంది దొంగతనము చేసి యీ ప్రక్కకు వచ్చిరి. మీరు వారిని ఇంటు వచ్చుట చూడలేదా ?"

ముని మౌనముగ నుండెను. అదియునుగాక ధ్యానములో నిమగ్నుఁడై యుండెను. ఆతనికి దొంగల జాడయుఁ దెలియదు. రాజభటులు వచ్చిన సంగతియుఁ దెలియదు. అంత రాజభటులకు సందేహము కలిగెను. వారాశ్రమములోఁ బ్రవేశించి యన్వేషించిరి. ఒక గోడమాటుననుండి దొంగలు తొంగితొంగి చూచుటను రాజభటులు కాంచి, వెంటనే పోయి చేతులకు సంకెళ్లువేసి యిట్లనిరి :- " ఏమిరా ! ఇఁ కఁ నెచ్చటికి వెళ్లఁగలరు ? దొంగిలించిన సామానెక్కడ ?"

ఇది వినఁగానే మూర్ఖులుకూడ మౌనులైరి. అంత రాజభటు లిది మౌనుల మోసమని గ్రహించిరి. రాజభటులిట్లనిరి :- " ఏమిరా ! మీరు దొంగలా ? సాధువులా ?" చోరులింకను మౌనము వహించిరి. చోరులనుకొని సాధుమునులను బంధింపఁ బోవుట లేదుగదా ? అను కొని రాజభటులు నలువైపులను ధనముకై వెదకిరి. వెదుకఁగా ధనమంతయు దొరికెను. అప్పుడు వారిసందేహము మాయమయ్యెను. వీరంఱు దాంభిక మౌనులని తలఁచిరి. "మౌనము గొప్ప అస్త్రము. దీనిచాటున సమస్త కుకర్మలు దాగిపోవును. వీరందఱు మహాత్ములు కాదు మహాతములని రాజభటులు గ్రహించిరి. వీరందఱకు నాయకుఁడు బయట చేతులెత్తుకొని నిలుచున్నవాఁడే. వీరందఱది ఒక్కటియే పద్ధతి. పగలంతయు మానము, రాత్రులంతయు దొంగతనము" అనుచు రాజభటు లాచోరులతోఁగూడ మాండవ్య మహామునినిగూడ కట్టికొనిపోయిరి. గోధుమలతోఁబాటు పొట్టుకూడ నలిగిపోవును. పూలతోఁబాటు ముళ్లుకూడ శివలింగముపైఁ బడెను. తాంబూలముతోఁబాటు అవిశెఆకుకూడ రాజుచేతిలోనికిఁబోయెను. దుష్ట సంసర్గముచే సాధువుకూడ దుఃఖములోఁ బడిపోయెను.

మునులారా ! ఇప్పటికి కలియుగము వచ్చివేసినది. న్యాయము చేయువారు కూడ దొంగలైనారు. వారు కూడ ఏదోవిధముగ దొంగతనము చేయుచునేయున్నారు. అందువలన నీయుగములో దొంగతన మంత తప్పుగ నుండఁబోదు. ఇంతేకాదు. దొంగతనము కూడ ఒక కళగ నెన్నఁబడఁగలదు. కనుగప్పి దొంగతనము చేయుమందురు. ఎవరును బట్టుకొనఁజాలకుండునట్లు దొంగతనము చేయవలయును. ఒకవేళఁ బట్టుకొనఁబడినఁ గూటసాక్ష్యము నేర్పాటుచేసి, యది నియమానుసారమగు దొంగతనముకాదని న్యాయస్థానములో ఋజువు చేయఁ గలవారుకూడ నున్నారు. ఇట్టి విపరీతన్యాయముచే దొంగలుతప్పించుకొను చుందురు. దొరలు దండింపఁబడుదురు. అయితే మన మేయుగమును గూర్చి మాటలాడుకొనుచున్నామో ఆయుగములో దొంగతనము చాల అపరాధముగ నెన్న ఁబడుచుండెడిది. ఆ రోజులలో దొంగతనమునకు శిక్ష శూలమునఁ గ్రుచ్చుట. దొంగను నడిబజారులో నందఱ యెదుట శూలమునఁ గ్రుచ్చి రాజభటులు వెళ్లిపోయెడు వారు. గ్రుచ్చఁబడిన వాఁడు నెమ్మదిగాఁ జచ్చెడువాఁడు అంతఁ జండాలురు వాని శవమును గొనిపోయెడువారు.

వీరందఱును రాజభటులు రాజసమ్ముఖమునకుఁ గొనిపోయిరి. దొంగలు సొమ్ముతో ఁ బట్టుపడిరి. కాఁబట్టి అందఱను శూలముల గ్రుచ్చుఁడని రాజాజ్ఞాపించెను. కాని విచారణ చేయనేలేదు. దొంగలతోఁబాటు మాండవ్యమహామునిని గూడ శూలమునకుఁ గ్రుచ్చిరి. దొంగలందఱును గ్రుచ్చఁబడఁగానే చనిపోయిరి. కాని మాండవ్యుఁడు తపః ప్రభావముచే నచ్చట శూలముపై నుండి ధ్యానము చేయుచుండెను.

ఒక దినము గడచినది. రెండురోజులైనది. ఋషి అట్లే యుండుటను గ్రహించి భటులు రాజునకిట్లు నివేదించిరి :- " ప్రభూ ! ఒక దొంగ మాత్రము అట్లే శూలముమీద నింకను బ్రదికి కూర్చిండి యున్నాఁడు. శూల మాతని మలద్వారము నుండి శిరస్సువఱకు పోనట్లున్నది. అతనికి కష్టమేమియు కలుగ నట్లున్నది".

ఇది వినగానే రాజునకు సందేహము కలిగెను. ఆతఁడెవఁడో గొప్ప తపస్వియై యుండవలెను. రాజు ఆతురతతో మంత్రి పురోహితులను గూడుకొని శూల సమీపమునకు బోయెను. పురోహితుఁడు తపస్విని గుర్తించి "మహారాజా ! చాల యనర్థము సంభవించినది. ఈతఁడు పరమతేజస్వియుఁ దపోరాశియు నగు మాండవ్యమహాముని". అనెను. రాజాతనిని శూలమునుండి దింపించెను. అతం నాతనిని విధ్యుక్తముగఁ బూజించి,చేతులుజోడించి తిదీనతతో నిట్లనెను :- " బ్రాహ్మణోత్తమా ! అజ్ఞానియగు నన్ను క్షమింపుఁడు. మహర్షీ ! మా వలన నీ ఘోరాపరాధము అజ్ఞానము వలన సంభవించినది. ప్రభూ ! మీరు నా యెడలఁ బ్రసన్నులు కండు. క్రోధించి నా రాజ్యపరివారమును భస్మము చేయకుఁడు."

రాజు పలికిన వినయోక్తులను విని మహర్షి యిట్లనెను :- " రాజా ! నీకు మేలు కలుగుఁగాక ! నీవు చింతింప వలదు. నీమీఁద నా కిసుమంతైన క్రోధములేదు. అందఱు వారివారి కర్మల ననుసరించి సుఖదుఃఖముల ననుభవింతురు. ఈ కర్మఫలము ననుభవించుటకు నేనేదియో ఘోరపాపము చేసియుండవచ్చును. నేను బాల్యమునుండియు తపోనిరతుఁడనై యుంటిని. సదా సదాచారమున వర్తించుచుంటిని. ఎన్నడు హింసయనుమాట నెఱుఁగను. అట్టియెడ నీదారుణ దుఃఖిమేల నే ననుభవింపవలసి వచ్చెనా యని నేనాలోంచిచున్నాను. మంచిది. నేను యమధర్మరాజు నడిగెదను."

రాజు ప్రాణములు కుదుటఁ బడెను. అతఁడు ఋషిని గూర్చి భయపడు చుండెను. ఈ తపస్వులు ఒంటెలు ఎటుమళ్లెదరో యెవరికిని దెలియదు. వారికెవరిమీఁదనైనఁగోపము వచ్చెనా యిఁక నెవరి మాటలను వినరు. వారి వాగ్వజ్రమును విడువనే విడుతురు. రాజిట్లనుకొనెను :- " అమ్మయ్య ! నామీఁద నుండి గ్రహము మరలినది. ఋషి క్రోధము యమరాజుమీఁదకు విసురుకొనినది. ఇద్దరు సమర్థులే. పరస్పరము తట్టుకొనఁ గలుగుదురు " అని తలఁచి రాజు అర్ఘ్య పాద్యాదులతో మునిని విధ్యుక్తముగఁ బూజించెను. రాజా శూలమును ఋషి శరీరమునుండి యనేక విధములుగ నూడబెరుకఁ బ్రయత్నించెను గాని రాలేదు. అప్పుడు ఋషి యాజ్ఞచే బయటనున్న శూలమును గోయించెను. కాని శూలము (అణీ) ములికి ఋషి శరీరములోనే యిరుకుకొనెను. అందువల నాతనికి "అణీమాండవ్యుడు" అను ప్రసిద్ధి కలిగెను.

ఋషికి కోపము వచ్చుచుండెను. ఆతఁడు తన తపో ప్రభావమునను, యోగప్రభావమునను యమలోకమునకుఁ జేరుకొనెను. ఋషి వచ్చుటను గాంచి యమధర్మరాజు శీఘ్రముగ లేచి యాతనికి స్వాగత సత్కారములఁ గావించి, యర్ఘ్యపాద్యాదులచే నాతనిని ఁ బూజించెను. ఆతని పూజను గమనింపకయే ఋషి యమునిగద్దించుచు నిట్లనెను :- " యమరాజుగారూ ! అబ్బ ! మీరు న్యాయశీలములోఁ బ్రసిద్ధులు కదండీ మీరందఱకుఁ బాప పుణ్యములను బట్టి ఫలముల నొసంగుచుడెదరు కాఁబోలును. ఈ శూలమును బ్రయత్న పూర్వకముగఁ బీకినను రాలేదే ! యిట్టి శూలదండమును నా కేపాపకారణమున నిచ్చితిరో కొంచెము దయచేసి చెప్పుఁడు . నేనేమి పాపము చేసితిని ?"

యమధర్మరాజు నిర్ఘాంతపడి పోయెను. ఋషియొక్క క్రోధముఖమును జూచునప్పటి కాతని ముఖము వాడిపోయెను. ఓదార్పుతో నాతఁడిట్లనెను :- " బ్రాహ్మణోత్తమా ! తమరు వేంచేయుఁడు. తాము స్వస్థచిత్తులరు కాఁగానే నేను తమ ప్రశ్నలన్నిటికిని బ్రత్యుత్తరము లిచ్చెదను."

ఋషి శాంతింపలేదు. ఆతఁ డిట్లనెను :- " కాదు, ముందు నాకు చెప్పినఁగాని నేను గూర్చుండను."

వైవస్వతుఁడు వివశుఁడై, నమ్రతతో నిట్లనెను :- " బ్రాహ్మణోత్తమా ! బాల్య కాలములో మీరు దర్భమొనతో తూనీఁగను గ్రుచ్చి విడిచి పెట్టితిరి. దాని శరీరమునుండి నీవు దానినితీయకయే విడిచితివి. కావున నీ యణి (ములికి) నీశరీరమున మృత్యుపర్యంత ముండఁగలదు"

ఋషి ఒడలెఱుఁగక " ఇదెప్పటి సంగతి ?" అనెను.

"మీ బాల్యమున" అని యముఁడనెను.

ఋషి యిట్లనెను :- " బాల్యమున ధర్మాధర్మములు తెలియఁజాలవు. ఒకవేళ చేసియుండిన నది బాల సులభ చంచలతా వశమునఁ జేసియుందును. ఇంత చిన్నదోషమున కింతటి ఘోర దండమా ? నీవు శూద్రవృత్తికి సంబంధించిన కార్య మొనర్చితివి. కావున నీవు నూఱుసంవత్సరములు శూద్రుఁడవై భూమిమీఁద బుట్టియుండవలసినదని నిన్ను శపించుచున్నాను."

యముడు కుపితుఁడగు మునిని మధురవచనములతో వినయ యుక్తముగఁ బలికి ప్రసన్నుని గావించి యిట్లనెను :- "స్వామీ ! ఏయపరాధమును మీరు నాపై ఁ ద్రోసితిరో దొనిని మీరే చేయుచున్నారు. నాకు నాన్యాయముకొఱ కిట్టి ఘోర దండమా ?"

ముని శాంతుఁడు కాఁగానే యాతని యెడలఁ బ్రసన్నుఁడై యిట్లనెను :- " ధర్మరాజా! నే నెగతాళికి కూడ అబద్ధమాడను. కావున నీవు భూమిపై శూద్రుఁడవై జన్మింపవలసినదే. కాని నీవు నామమాత్రమునకే శూద్రుఁడవు. నీతల్లి శూద్రయగుటచే నీవు శూద్రుఁడుగ నెన్నఁబడుదువు. కాని నీవు వ్యాస వీర్యమున న్భుదవింపఁగలవు. రాజకులమందు నీవు శ్రేష్ఠుఁడవుగను, మాననీయుఁడగను నెన్నఁబడఁగలవు. అందఱు నిన్ను దేవతగ నాదరింపఁగలరు. నీవక్కడకూడ నీ నీతి ధర్మ స్వభావమును వీడవు. నీవు సర్వశ్రేష్ఠుఁడవగు నీతిజ్ఞుఁడవుగ నెన్నఁబడెదవు నీ నీతి విద్వాంసులలో గొప్ప యాదరమును బొందఁగలదు. ఇంకొక గొప్ప విశేషమేమన నీవు నందనందన గోపాలకృ ష్ణునకు మిక్కిలి ప్రియుఁడ వయ్యెదవు. మనుష్య మానమున నూరుసంవత్సరములకు పైగా, అనఁగా దేవతామానమున నాలుగైదు నెలలు మాత్రమే శూద్రుఁడవైయుండి పిదప నీ స్వస్థానమునకు రాఁగలవు" అని పలికి ముని యిచ్చానుసారముగ లోకములకుఁబోయెను.

శౌనకుఁడిట్లడిగెను :- " సూతా ! న్యాయ మొనర్చు యమధర్మరాజు లేకపోయిన పాపులకుఁ బాపఫలమును, పుణ్యులకు ఁ బుణ్యఫలము నొసంగు వాఁడెవఁడు ? అప్పుడు (దేవతా మానమున నాలుగైదు నెలలు) యమధర్మరాజు పని ఆగిపోయినదా ?"

సూతుఁడిట్లనెను :- " మహర్షీ ! ఎప్పుడైన లోకవ్యవహార మాగిపోవునా ? వందలకొలఁది యములు, ఇంద్రులు కుబేరులు, వరుణులు మారిపోయిరి. వందలసార్లు సృష్టి ప్రలయములు జరిగినవి. యముఁడు శూద్రుఁడుగా, విదురరూపమున నున్నంతవఱకు, నిత్యపితురులలో నర్యముఁడనువాఁడు యముని స్థానము నాక్రమించి న్యాయమును జరుపుచుండెను. విదుర శరీరమును వదలి మరల తాను యముఁడు కాఁగానే తనకార్యమును యథారీతిగ మరలఁ జేయసాగెను."

శౌనకుఁడిట్లు ప్రశ్నించెను :- " సూతా ! నీవు చాల యద్భుత కథను జెప్పితివి. విరుదుఁడు తన పాంచభౌతిక శరీరము నెట్లు విడిచినాఁడో ఆకథయంతయు దయచేసి విపులముగఁ జెప్పవలయునని కోరుచున్నాను. "

సూతుఁ డిట్లనెను :- " శౌనకా ! మొట్టమొదట నేను మీకు ధృతరాష్ట్రుని సద్గతి కథను వినిపించెదను ఆ నిమిత్తముననే విదురుఁడు హస్తినాపురమునకు వచ్చెను. అంధుఁడగు దన యన్న ధృతరాష్ట్రుని విదురుఁడెట్లు ఇంటింనుండి వెడలించి తీసికొనివచ్చెనో మునుముందుగా నావృత్తాంతమును జెప్పెదను, వినుఁడు ."

శౌనకుఁడిట్లనియె :- " సూతా ! నీకెట్లు రుచించిన నట్లు నీకు ఉచితమగు రీతిని జెప్పుము."

ఛ ప్ప య

బాఁధే చోరని సహిత నికట నరపతి కే లాయే |

బిను విచార ముని సహిత చోర శూలీ లటకాయే ||

తపతేఁ ముని నహిఁ మరే మర్మభూపతి జబ జాన్యోఁ

క్షమా యాచనా కరీ, దోషముని ఆపన మాన్యో ఁ ||

కోధిత లఖి యమనే కహీ, చేదే కృమి ఛోడే అవశ |

శాపదయే "యమశూద్రహో" భ##యే విదుర మునికోపవశ ||

అర్థము

బాధించుచు మాండ్యవుని గూడ చోరులతో రాజు దగ్గఱకుఁ గొనివచ్చిరి. రాజు విచారింపకయే చోరులతోఁగూడ నీతనిని గూడ శూలమున కెక్కించెను. తపోశక్తిచే ముని చావలేదను సంగతిని రాజు తెలిసికొని, ఆతనిని విడిపించి క్షమింప వేఁడుకొనెను. అంత ముని, దోషము తనదేనని క్రోధమున యముని దగ్గఱకుఁబోయి అడుఁగగా నాతఁడు 'నీవు తూనీఁగకు ముల్లుగ్రుచ్చి వదలితి' వనెను. దానికి మాండవ్యుఁడు మండిపడి 'తెలియనప్పుడు చేసినదానికి శిక్షించెదవా ?' యని 'నీవు శూద్రుఁడవగు' మని శపించెను. ఆ యముఁడే విదురుఁడయ్యెను.

BHAGAVATA KADHA-3    Chapters